modi: వరంగల్ జిల్లా మహిళతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధాని మోదీ!

  • 'ప్రధాన మంత్రి జన్ సంవాద్' కార్యక్రమంలో పాల్గొన్న మోదీ
  • స్వయం సహాయక బృంద సభ్యురాళ్లతో మాట్లాడిన ప్రధాని
  • మోదీతో మాట్లాడిన వరంగల్ అర్బన్ జిల్లా మహిళ కౌసర్

వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలానికి చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు కౌసర్ సాహెన్ బేగంతో ప్రధాని మోదీ మాట్లాడారు. వివరాల్లోకి వెళ్తే, 'ప్రధాన మంత్రి జన్ సంవాద్' కార్యక్రమం ద్వారా వివిధ వర్గాల ప్రజలతో మోదీ మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నేడు దేశ వ్యాప్తంగా ఉన్న పలు స్వయం సహాయక బృందాల మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ముచ్చటించారు.

ఈ సందర్భంగా జీవితంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, స్వయం సహాయక బృందంలో చేరిన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి మోదీకి కౌసర్ వివరించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక బృందాల్లోని మహిళలను మోదీ అభినందించారు. తెలంగాణలోని మహిళల్లో చాలా మార్పు వచ్చిందని, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పారు. 2014లో 20 లక్షల స్వయం సహాయక బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని... రూ. 2.25 కోట్ల కుటుంబాలను ఈ బృందాల కిందకు తీసుకొచ్చామని తెలిపారు.  

  • Loading...

More Telugu News