USA: ఆయుధాలు లేవు, బెదిరింపులు లేవు... నిమిషాల్లో రూ. 19 లక్షల విలువైన యాపిల్ ఫోన్ల దోపిడీ!

  • కాలిఫోర్నియాలో ఘటన
  • నిమిషాల్లో పని కానిచ్చిన దొంగలు
  • 26 ఫోన్లు, ఇతర ఉపకరణాలు చోరీ

యూఎస్ లోని కాలిఫోర్నియాలో జరిగిన ఓ దొంగతనం కలకలం రేపుతోంది. వచ్చీపోయే కస్టమర్లతో ఉన్న ఓ యాపిల్ స్టోర్ పై ఆయుధాలు లేకుండా దాడి చేసిన 16 నుంచి 18 ఏళ్ల వయసున్న దొంగలు నిమిషాల్లో రూ. 19 లక్షల విలువైన యాపిల్ ఫోన్లను దోపిడీ చేసుకుపోయారు. కాలిఫోర్నియా పరిధిలోని  ఫ్రెస్నోలో ఉన్న ఫ్యాషన్ ఫెయిర్ మాల్ లో ఉన్న యాపిల్ స్టోర్ లో ఈ ఘటన జరుగగా, ఏం జరిగిందో ఉద్యోగులు, కస్టమర్లు తెలుసుకునేలోపే దొంగతనం జరిగిపోయింది.

 సీసీటీవీ కెమెరాల్లో కనిపించిన దృశ్యాల ప్రకారం, హుడెడ్ షర్ట్ లు వేసుకుని వచ్చిన నలుగురు నల్లజాతి యువకులు తమ ముఖాలను కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. అపై వెంటనే కౌంటర్లలో ఉన్న సెల్ ఫోన్లను, ఇతర ఉపకరణాలను, మ్యాక్ బుక్ లను తీసుకుని వెళ్లిపోయారు. చుట్టూ ఉన్నా వారు దిగ్భ్రాంతికి గురై తేరుకునేలోపే పారిపోయారు. ఐఫోన్ 6, 7, 8 వేరియంట్లకు చెందిన 26 ఫోన్లతో పాటు పలు ఉపకరణాలను తీసుకెళ్లారని, వీరి కోసం మాల్ బయట మరికొందరు వేచి ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గతంలో ప్రెస్నోలోని యాపిల్ స్టోర్ లోనూ ఇదే విధమైన దోపిడీ జరగడంతో, దీనికి, దానికి ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News