nayanatara: నయనతారను అభినందించిన సమంత!

- నయనతార తాజా చిత్రంగా 'కొలమావు కోకిల'
- ట్రైలర్ కి అనూహ్యమైన స్పందన
- నయనతార నటన అద్భుతం
తెలుగు .. తమిళ భాషల్లో నయనతారకు విపరీతమైన క్రేజ్ వుంది. ఈ రెండు భాషల్లో సమంత కూడా అగ్రకథానాయికగా కొనసాగుతోంది. అలాంటి సమంత తాజాగా నయనతారను అభినందించడం ఆసక్తికరంగా మారింది. నయనతార తాజా చిత్రంగా తమిళంలో 'కొలమావు కోకిల' సినిమా నిర్మితమైంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమా నుంచి, ఈ నెల 5వ తేదీన ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
