Pawan Kalyan: జగన్ యాత్ర ముగిసేవరకూ రావద్దన్న పోలీసులు... నిర్ణయాన్ని మార్చుకున్న పవన్ కల్యాణ్!

  • తూర్పు గోదావరి జిల్లాలో జగన్ యాత్ర
  • అదే సమయంలో పవన్ వస్తే భద్రత కష్టం
  • స్పష్టం చేసిన పోలీసులు

ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో సాగుతుండగా, అదే జిల్లాలో తన యాత్రను తలపెట్టిన పవన్ ను పోలీసులు వారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో యాత్రను ముగించుకున్న పవన్ కల్యాణ్, తూర్పు గోదావరి జిల్లాలో యాత్రను ప్రారంభించాలని భావించి పోలీసులకు సమాచారం అందించారు.

అయితే ఓపక్క జగన్ యాత్ర సాగుతున్నందున పూర్తి భద్రతను కల్పించలేమని పోలీసులు స్పష్టం చేయడంతో, తన నిర్ణయాన్ని మార్చుకున్న పవన్, తొలుత పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్రను తలపెట్టినట్టు తెలుస్తోంది. ఈ నెల 16వ తేదీ నుంచి ఆయన యాత్ర ప్రారంభమవుతుందని సమాచారం. ఈ విషయమై జనసేన నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

Pawan Kalyan
Jagan
padayatra
Andhra Pradesh
Police
East Godavari District
West Godavari District
  • Loading...

More Telugu News