Vijay Devarakonda: నచ్చిన చొక్కా దొరకలేదంటూ... బస్ స్టాప్ లో షర్ట్ లేకుండా నిలుచున్న విజయ్ దేవరకొండ!

  • యూత్ ఐకాన్ గా మారిన విజయ్ దేవరకొండ
  • త్వరలోనే సొంత దుస్తుల బ్రాండ్ 'రౌడీ క్లబ్'
  • 'రౌడీ క్లబ్' ప్రమోషన్ లో బిజీ

'అర్జున్ రెడ్డి' వంటి బంపర్ హిట్ తో యూత్ ఐకాన్ గా మారిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'ట్యాక్సీ వాలా', 'నోటా', 'గీత గోవిందం' చిత్రాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే సొంత దుస్తుల బ్రాండ్ 'రౌడీ క్లబ్'ను ప్రారంభించనున్న ఆయన, తన ప్రచారాన్ని ట్విట్టర్ వేదికగా మొదలుపెట్టాడు. ఓ బస్ స్టాప్ లో షర్ట్ లేకుండా నిలబడిన విజయ్, "బస్‌ స్టాప్‌ వద్ద ఎదురుచూస్తున్నాను. ఇప్పటికీ నాకు నచ్చిన చొక్కా దొరకలేదు. నేనూ మీలాగే రౌడీనే" అంటూ ఓ ఫొటో విడుదల చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.

తన స్నేహితులను, అభిమానులను 'రౌడీస్' అని సంబోధిస్తుండే విజయ్, ఇటీవల ఫిలిం ఫేర్ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యేందుకు 'రౌడీ' అని డిజైన్ చేసిన దుస్తులను వేసుకుని వచ్చి అందరినీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. తన రౌడీ క్లబ్ లో ఎవరైనా చేరవచ్చని చెబుతూ, ఓ వెబ్ సైట్ లింక్ ను కూడా విజయ్ పంచుకున్నాడు. అందులో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని, ఈ బ్రాండ్ దుస్తులను జూలై 15 నుంచి అందుబాటులోకి తెస్తానని ప్రకటించాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News