Congress: 2019లో బీజేపీ గెలిస్తే జరిగేది ఇదే.. శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు!

  • కలకలం రేపిన శశిథరూర్ వ్యాఖ్యలు
  • భారత్ కాస్తా ‘హిందూ పాకిస్థాన్’ అవుతుందన్న మాజీ మంత్రి
  • రాహుల్ క్షమాపణకు కాంగ్రెస్ డిమాండ్

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరువనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కనుక గెలిచి అధికారంలోకి వస్తే భారతదేశం కాస్తా ‘హిందూ పాకిస్థాన్’లా మారుతుందని పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో మైనారిటీ హక్కులకు గౌరవం ఉండదని, ఇక్కడ కూడా బీజేపీ అదే తరహాలో పాలన సాగించే అవకాశం ఉందని ఆరోపించారు.

ఇందుకోసం బీజేపీ అవసరమైతే కొత్త రాజ్యాంగాన్ని రాసుకుంటుందని విమర్శించారు. బీజేపీ కనుక వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో వస్తే ఇప్పటి వరకు ఉన్న రాజ్యాంగం స్థానంలో కొత్తది రావడం తథ్యమన్నారు. భారత్‌ను బీజేపీ హిందూ దేశంగా మారుస్తోందని దుయ్యబట్టారు. శశిథరూర్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆయన వ్యాఖ్యలకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బాధ్యత వహిస్తూ తక్షణమే క్షమాపణ చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు.

Congress
BJP
shashi tharoor
Rahul Gandhi
  • Loading...

More Telugu News