Koppula sharath: హైదరాబాద్ చేరుకున్న శరత్ మృతదేహం.. నివాళులర్పించిన బండారు దత్తాత్రేయ

  • శరత్ మృతదేహానికి పలువురి నివాళి
  • అనంతరం వరంగల్‌కు తరలింపు
  • నేడు అంత్యక్రియలు

అమెరికాలో దారుణహత్యకు గురైన వరంగల్ విద్యార్థి కొప్పుల శరత్ మృతదేహం బుధవారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. శరత్ మృతదేహానికి కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి సహా పలువురు నివాళులర్పించారు. శరత్ ఎమ్మెస్ చదివేందుకు ఆరు నెలల క్రితం అమెరికా వెళ్లాడు. అక్కడ చదువుకుంటూనే ఓ హోటల్‌లో తాత్కాలికంగా ఉద్యోగం చేస్తున్నాడు.

ఈ క్రమంలో గత శుక్రవారం దొంగతనానికి వచ్చిన ఓ దుండగుడు శరత్‌పై కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలపాలైన శరత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, శరత్ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి స్వస్థలం వరంగల్‌కు తరలించారు. నేడు నగరంలోని కరీమాబాద్‌లో అంత్యక్రియలు జరుగుతాయి. 

Koppula sharath
America
Warangal Urban District
  • Loading...

More Telugu News