ntr: ‘యన్.టి.ఆర్’ సెట్స్ లో లెజెండరీ రామోజీరావును కలవడం మరవలేను: దర్శకుడు క్రిష్

  • రామోజీరావుని కలిసిన అద్భుత క్షణాలను మర్చిపోలేను
  • చిత్ర యూనిట్ అంతా సంభ్రమాశ్చర్యాలకు గురైంది
  • రామోజీరావుకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా

ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘యన్.టి.ఆర్’ చిత్రానికి క్రిష్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ‘యన్.టి.ఆర్’ సెట్స్ కు ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు వెళ్లారు. ఈ విషయాన్ని క్రిష్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ‘యన్.టి.ఆర్’ సెట్స్ లో లెజెండరీ రామోజీరావుని కలిసిన అద్భుత క్షణాలను మర్చిపోలేనని, చిత్ర యూనిట్ అంతా సంభ్రమాశ్చర్యాలకు గురైందని అన్నారు. సెట్స్ లో రామోజీరావుతో అరగంట సేపు గడిపే అవకాశం తమకు దక్కిందని, ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని, ఈ సందర్భంగా రామోజీరావుకి తన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు క్రిష్ చెప్పారు.

ntr
krish
ramojirao
  • Error fetching data: Network response was not ok

More Telugu News