polavaram: రాజమహేంద్రవరం చేరుకున్న నితిన్‌ గడ్కరీ

  • కాసేపట్లో పోలవరంకు గడ్కరీ
  • చంద్రబాబుతో కలిసి ప్రాజెక్టు పరిశీలన
  • అధికారులతో సమీక్ష

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజమహేంద్ర వరం చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో పోలవరం ప్రాజెక్టు వద్దకు బయలుదేరారు. కాసేపట్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి పోలవరం పనులను పరిశీలించనున్నారు. పోలవరం కాంట్రాక్ట్ ఏజెన్సీలతో పాటు అధికారులతో నితిన్‌ గడ్కరీ సమీక్ష నిర్వహిస్తారు.

సుమారు పది నెలల తర్వాత గడ్కరీ పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. కాగా, మరోవైపు పోలవరం ప్రాజెక్టు వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. గడ్కరీ వచ్చే హెలిప్యాడ్‌ వద్దకు వెళ్లాలని చూసిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తమను అనుమతించాలని వారు ఆందోళనకు దిగారు. పాస్‌లు ఉన్నవారినే పంపుతామని పోలీసులు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.    

polavaram
nitin gadkari
Chandrababu
  • Loading...

More Telugu News