Chandrababu: పారిశ్రామిక పెట్టుబడుల కోసమే సింగపూర్ లో పర్యటనకు వెళ్లా: సీఎం చంద్రబాబు

  • నా సింగపూర్ పర్యటనపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు
  • ఈ విమర్శలను ఖండిస్తున్నా
  • నా పర్యటన వివరాలన్నింటిని ఆన్ లైన్ లో ఉంచా

సింగపూర్ లో జరిగిన ప్రపంచ నగరాల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొని తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబు పర్యటనపై విపక్షనేతలు విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ‘దోచుకున్న సొమ్మును దాచుకునేందుకే చంద్రబాబు సింగపూర్ వెళ్లారు’ అని వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై చంద్రబాబు స్పందించారు.

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సింగపూర్ పర్యటనపై కొంతమంది విమర్శలు చేస్తున్నారని, పారిశ్రామిక పెట్టుబడుల కోసమే తాను అక్కడికి వెళ్లానని చెప్పారు. తన పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలు ఆన్ లైన్ లో ఉంచామని చెప్పారు. ఈ సందర్భంగా ఏపీలో నెలకొల్పిన కియా మోటార్స్ గురించి ఆయన ప్రస్తావించారు. జనవరిలో ఈ సంస్థకు చెందిన మొదటికారు బయటకు వస్తుందని అన్నారు.

Chandrababu
singapore
  • Loading...

More Telugu News