Nara Lokesh: లోకేష్ ను మోహన్ రెడ్డి హిప్నటైజ్ చేశారని అనుకుంటున్నారు: టీజీ వెంకటేష్

  • బీఫామ్ ఇచ్చే ముందు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటిస్తారు
  • లోకేష్ ముందుగా ఎందుకు ప్రకటించారో అర్థం కావడం లేదు
  • లోకేష్ ప్రకటన ఆశ్చర్యాన్ని కలిగించింది

రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను మంత్రి నారా లోకేష్ ప్రకటించడంపై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ స్పందించారు. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ప్రకటించడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై ముఖ్యమంత్రి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకున్న తర్వాత తాను స్పందిస్తానని తెలిపారు. బీఫామ్ ఇచ్చే ముందు అభ్యర్థిని చంద్రబాబు ప్రకటిస్తారని... కానీ, ముందుగానే లోకేష్ ఎందుకు ప్రకటించారో అర్థం కావడం లేదని అన్నారు. లోకేష్ ను ఎస్వీ మోహన్ రెడ్డి హిప్నటైజ్ చేశారని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.

కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బుట్టా రేణుక, ఎమ్మెల్యే అభ్యర్థిగా మోహన్ రెడ్డి పేర్లను లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు, కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ను తన కుమారుడికి ఇప్పించుకునేందుకు టీజీ యత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

Nara Lokesh
tg venkatesh
Chandrababu
sv mohan reddy
butta renuka
  • Loading...

More Telugu News