charan: ఖర్చు తగ్గించాల్సిందేనని బోయపాటికి చెప్పిన చరణ్?

  • బోయపాటి దర్శకత్వంలో చరణ్ 
  • భారీతనంపై దృష్టిపెట్టిన బోయపాటి 
  • నిర్మాతకి లాభాలు రావాలన్న చరణ్

ప్రస్తుతం చరణ్ .. బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. డీవీవీ దానయ్య ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 'రంగస్థలం' భారీ హిట్ తరువాత చేస్తోన్న సినిమా కావడం వలన, ఈ సినిమా కథాకథనాల విషయంలో చరణ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని చెబుతున్నారు. అంతేకాదు ఈ సినిమా బడ్జెట్ విషయంపై కూడా చరణ్ ప్రత్యేక దృష్టి పెట్టాడని అంటున్నారు.సహజంగానే బోయపాటి తన సినిమాల్లో భారీతనాన్ని చూపిస్తుంటాడు. అందుకోసం ఆయన పెద్దమొత్తంలో ఖర్చు చేయిస్తుంటాడు. ప్రస్తుతం చేస్తోన్న సినిమా విషయంలోను ఆయన అదే పద్ధతిని కొనసాగిస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ ఇంట్రడక్షన్ సీన్ కోసమే ఆయన భారీ మొత్తమే ఖర్చు చేయించాడట. ఖర్చు పెరిగిపోతూ వుండటాన్ని గమనించిన చరణ్, ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే 10 కోట్ల తక్కువకే చిత్రీకరణ పూర్తి చేయాలని బోయపాటికి చెప్పినట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త వినిపిస్తోంది. మార్కెట్ వుంది కదా అని ఖర్చు చేయించవద్దనీ .. నిర్మాతకి లాభాలు రావాలని చెప్పడమే కాకుండా, ఎప్పటికప్పుడు ఖర్చు గురించిన వివరాలు తెలుసుకుంటూ నియంత్రణ చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

charan
boyapati
  • Loading...

More Telugu News