thulasi reddy: కాంగ్రెస్‌ పార్టీ గెలిచి ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయ్యేది: తులసిరెడ్డి

  • 2019 జూన్‌ చివరి నాటికైనా పూర్తి చేయాలి
  • రాష్ట్ర  ప్రజలపై భారం పడకుండా ప్రాజెక్టు పనులు జరగాలి
  • కేంద్ర సర్కారు నిధులతో పూర్తి చేయాలి
  • భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి

పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్‌ పార్టీ మానసపుత్రిక అని, 2014లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి ఉంటే ఈ పాటికి పూర్తయ్యేదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టును 2019 జూన్‌ చివరి నాటికైనా పూర్తి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్ర  ప్రజలపై భారం పడకుండా కేంద్ర సర్కారు నిధులతో పూర్తి చేయాలని, భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని అన్నారు.

విజయవాడలోని తమ పార్టీ కార్యాలయంలో తులసిరెడ్డి మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను నమ్మి మోసం చేశాయని, విభజన చట్టంలోని హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, కేంద్ర ప్రభుత్వ నిధులతో సత్వరం పూర్తి చేయాలని చట్టం చెబుతున్నప్పటికీ ఆ ప్రాజెక్టు నత్తనడకన ముందుకు సాగుతుండడం శోచనీయమని అన్నారు.

thulasi reddy
Apcc vice president
Congress
  • Loading...

More Telugu News