rakul: 'ఎన్టీఆర్' బయోపిక్ లో రకుల్ ప్రీత్?

  • షూటింగు దశలో 'ఎన్టీఆర్' బయోపిక్
  • కీలకమైన పాత్రలో విద్యాబాలన్ 
  • ముఖ్యపాత్రల్లో మోహన్ బాబు .. రానా  

నందమూరి అభిమానుల దృష్టి మొత్తం 'ఎన్టీఆర్' బయోపిక్ పైనే వుంది. ఈ సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వాళ్లు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా .. బసవతారకం పాత్రను విద్యాబాలన్ చేస్తున్నారు.

ఇక మోహన్ బాబు .. రానా కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి తాజాగా రకుల్ పేరు తెరపైకి వచ్చింది. ఒక ప్రత్యేకమైన పాట కోసం దర్శకుడు క్రిష్ .. రకుల్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తమిళ .. హిందీ సినిమాలతో రకుల్ బిజీగా వుంది. అయినా ఈ ప్రాజెక్టుకి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆమె ఈ ప్రత్యేకమైన పాటలో మెరవడానికి అంగీకరించిందని అంటున్నారు. ఎన్టీఆర్ సినిమాల్లో ప్రత్యేక గీతాలు కూడా బాగా పాప్యులర్ అయిన సంగతి తెలిసిందే.  

  • Loading...

More Telugu News