Kathi Mahesh: పరిపూర్ణానందకు అనూహ్య మద్దతు... నగర బహిష్కరణను ఖండించిన కత్తి మహేష్!

  • బహిష్కరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
  • సమాజం తిరోగమిస్తుంది
  • ఫేస్ బుక్ ఖాతాలో కత్తి మహేష్

తనతో పాటు నగర బహిష్కరణకు గురైన శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామికి మద్దతుగా నిలిచాడు కత్తి మహేష్. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ, "పరిపూర్ణానంద నగర బహిష్కరణను ఖండిస్తున్నాను. బహిష్కరణలు ఈ సమస్యకు పరిష్కారం కాదు. బహిష్కరణ ఆధునిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.

'మనుషుల్ని తప్పిస్తే సమస్యలు తప్పుతాయి' అనే ఆటవిక సమాజం దిశగా ప్రభుత్వాలు పయనిస్తే అది తిరోగమనమే అవుతుంది" అని వ్యాఖ్యానించాడు. సమన్యాయం విషయంలో తాను అభ్యంతరం వ్యక్తం చేసిన మాట వాస్తవమే అయినా, ఇలా అప్రజాస్వామికమైన నిర్ణయాలు తీసుకుంటే, అది సమాజానికి మంచిది కాదని, వ్యవస్థలో పాటిస్తున్న విధానాలను ఖండించి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని అన్నాడు.

Kathi Mahesh
Paripoornananda
Hyderabad
Facebook
  • Error fetching data: Network response was not ok

More Telugu News