amit shah: అన్నాడీఎంకేని అమిత్ షా పల్లెత్తు మాట కూడా అనలేదు: మంత్రి జయకుమార్

  • అవినీతిలో దేశంలోనే తమిళనాడు నెంబర్ వన్ గా ఉందన్న అమిత్ షా
  • అమిత్ షా చెప్పిన మాటను తప్పుగా తమిళంలోకి అనువదించారన్న మంత్రి
  • అన్నాడీఎంకే పథకాలను కేంద్రం అభినందిస్తోందన్న జయకుమార్

అవినీతిలో దేశంలోనే తమిళనాడు నెంబర్ వన్ గా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తమిళనాట కలకలం రేపుతున్నాయి. సోమవారంనాడు చెన్నైలోని గోల్డెన్ బీచ్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగసభలో అమిత్ షా ప్రసంగిస్తూ, ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై తమిళనాడు మత్స్యశాఖ మంత్రి జయకుమార్ స్పందిస్తూ, అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని అమిత్ షా విమర్శించలేదని అన్నారు. అమిత్ హిందీలో చెప్పినదాన్ని బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా తమిళంలోకి తప్పుగా తర్జుమా చేశారని తెలిపారు. అన్నాడీఎంకేని అమిత్ షా పల్లెత్తు మాట కూడా అనలేదని చెప్పుకొచ్చారు. అన్నాడీఎంకే చేపట్టిన పథకాలను కేంద్ర ప్రభుత్వం అభినందిస్తోందని చెప్పారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ కూడా అన్నాడీఎంకే ప్రభుత్వం గురించి ఏనాడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపారు.

amit shah
Tamilnadu
corruption
  • Loading...

More Telugu News