Rape: చికిత్స పొందుతూ మృతి చెందిన రేప్ బాధిత బాలిక

  • బాలికపై అత్యాచార యత్నం
  • ప్రతిఘటించడంతో దాడి
  • వారం తర్వాత ఆసుపత్రిలో బాలిక మృతి

14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించి విఫలమైన యువకుడు ఆమెను దుడ్డుకర్రతో బాది పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో జరిగిందీ ఘటన. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో బాలిక మృతి చెందినట్టు ఈస్ట్ కాశీ హిల్స్ ఎస్పీ స్టెఫాన్ రింజా తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే మోపిన కేసులకు ఇప్పుడు హత్య కేసును కూడా జోడించనున్నట్టు చెప్పారు.

ఈ నెల 3వ తేదీన బాధిత బాలిక దుస్తులు ఉతికేందుకు సమీపంలోని నదికి వెళ్తుండగా జాన్సింగ్ రాణి అనే యువకుడు ఆమెను అడ్డుకున్నాడు. అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో తన వద్ద ఉన్న పారతో ఆమెపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బాలికను గుర్తించిన గ్రామస్తులు వెంటనే ఆమెను గణేశ్ దాస్ మెటర్నిటీ అండ్ చిల్డ్రన్ ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వుడ్ ల్యాండ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికపై అత్యాచారానికి ప్రయత్నించి, మరణానికి కారణమైన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిందితుడికి బెయిలు రాకుండా అడ్డుకుంటామని పోలీసులు తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News