Hyderabad: పరిపూర్ణానంద స్వామిపైనా ఆరు నెలల నగర బహిష్కరణ శిక్ష... డీజీపీ సంచలన నిర్ణయం!

  • ఉత్తర్వులు అందించిన నగర పోలీసులు
  • అనుమతి లేకుండా వస్తే కఠిన చర్యలని హెచ్చరిక
  • ఆపై తెలంగాణ నుంచి తరలింపు

కత్తి మహేష్ కు విధించిన శిక్షే శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామికీ విధించారు తెలంగాణ డీజీపీ. ఆయన్ను ఆరు నెలల పాటు హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. పోలీసుల అనుమతి లేకుండా నగరంలోకి పరిపూర్ణానంద ప్రవేశించే వీలు లేదని, ఈ ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

ఈ మేరకు ఆదేశాల కాపీని తెల్లవారుజామున మూడున్నర గంటలకు జూబ్లీహిల్స్ లోని పరిపూర్ణానంద ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనకు అందించారు. ఆపై ఏ వాహనంలో స్వామిని ఉంచారో తెలియనీయకుండా చేసి నాలుగు వాహనాల కాన్వాయ్ తో నగర శివార్ల వరకూ వచ్చి, ఆపై రెండు వాహనాలను విజయవాడవైపు, రెండు వాహనాలను శ్రీశైలం వైపు తరలించారు. ఆయన్ను కాకినాడ వైపు తీసుకెళుతున్నట్టు తెలుస్తోంది.

Hyderabad
Paripoornananda
DGP
Kathi Mahesh
  • Loading...

More Telugu News