Chandrababu: చంద్రబాబు ఇక్కడే కాదు.. విదేశాల్లో కూడా అబద్ధాలు చెబుతున్నారు: వాసిరెడ్డి పద్మ

  • చంద్రబాబు విదేశీ పర్యటనలతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది
  • అమరావతి అద్భుత నగరమంటూ కలరింగ్ ఇచ్చారు
  • ఎవరి సొమ్మని కంపెనీలకు భూమిని ఇస్తారు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విదేశీ పర్యటనల పేరుతో చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. దాదాపు 25 పర్యటనలు చేసిన చంద్రబాబు... ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటనల ద్వారా ఏపీకి ఎన్ని సంస్థలు వచ్చాయి? ఎంత మందికి ఉపాధి దొరికిందో చెప్పాలని అన్నారు.

చంద్రబాబు ఇక్కడే కాకుండా, విదేశాల్లో కూడా నాటకాలు ఆడతారని విమర్శించారు. అమరావతి అద్భుత నగరమని, రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయం జరుగుతోందంటూ సింగపూర్ లో ఫుల్ కలరింగ్ ఇచ్చారని దుయ్యబట్టారు. విదేశీ కంపెనీలకు భూములు ఇస్తామని ప్రకటిస్తున్నారని... ఎవరి సొమ్ము అని భూములను ఇస్తారని ప్రశ్నించారు. అవినీతి సంపాదనలో నారా లోకేష్ కు కూడా టార్గెట్లు పెట్టినట్టున్నారని ఎద్దేవా చేశారు. 

Chandrababu
vasireddy padma
  • Loading...

More Telugu News