sonali: కష్టకాలంలో మనిషి ఏదైనా చేయగలడు: సొనాలి బింద్రే భావోద్వేగపూరిత పోస్ట్‌

  • హై గ్రేడ్‌ కేన్సర్‌తో బాధపడుతోన్న సొనాలి
  • మనలో శక్తి దాగి ఉంది
  • దాన్ని బలవంతంగా బయటకు తీసుకొచ్చే వరకు తెలియదు
  • కష్టాలను తట్టుకొని మనుగడ సాగించగలిగే సామర్థ్యం మన సొంతం

తాను హై గ్రేడ్‌ కేన్సర్‌తో బాధపడుతున్నట్లు సినీ నటి సొనాలి బింద్రే ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. అమెరికాలోని న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటోన్న ఆమె.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ చేసింది. తనపై కొందరు కురిపిస్తోన్న ప్రేమ పట్ల ఉద్వేగపూరితంగా పలు విషయాలు పేర్కొంది.

తన అభిమాన రచయిత ఇసబెల్ అలెండె ఓ విషయాన్ని రాశారని, మనలో దాగి ఉన్న శక్తిని మనం బలవంతంగా బయటకు తీసుకొచ్చే వరకు మనం ఎంత శక్తిమంతులమో మనకు తెలియదని పేర్కొంది. కష్టకాలంలో మనిషి ఏదైనా చేయగలడని, కష్టాలను తట్టుకొని మనుగడ సాగించగలిగే అద్భుతమైన సామర్థ్యం మనిషి సొంతమని చెప్పింది. తనకు కేన్సర్‌ అని తెలిసినప్పటి నుంచి బంధువులు, స్నేహితులు అండగా నిలుస్తున్నారని, తనపై ఎనలేని ఆదరాభిమానాలు చూపిస్తున్నారని పేర్కొంది.

sonali
cancer
america
  • Loading...

More Telugu News