mithun chakravarthy: మిథున్ చక్రవర్తి కుమారుడికి యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు!

  • నాలుగేళ్ల పాటు శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడంటూ నటి ఫిర్యాదు
  • యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు
  • లక్ష పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీతో బెయిల్

లైంగిక దాడితో పాటు బలవంతంగా అబార్షన్ చేయించారన్న ఆరోపణలతో బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. హిందీ, భోజ్ పురి సినిమాల్లో నటించిన ఓ నటి ఆయనపై, ఆయన తల్లిపై కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి, నాలుగేళ్లుగా తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, తాను గర్భవతిని అయినప్పుడు ఏవో మందులు ఇచ్చి, గర్భస్రావం అయ్యేలా చేశాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. మహాక్షయ్ తో సంబంధాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన తల్లి తనను బెదిరించిందని తెలిపింది.

ఈ నేపథ్యంలో మహాక్షయ్ తో పాటు, ఆయన తల్లిపై కేసు నమోదైంది. తాజాగా మహాక్షయ్ కు ఢిల్లీ హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీతో బెయిల్ మంజూరయింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు కోర్టుకు హాజరుకావాలని, సాక్షులను ప్రలోభపెట్టరాదంటూ ఆదేశించింది. 

mithun chakravarthy
mahakshay
bail
  • Loading...

More Telugu News