Pawan Kalyan: అన్నయ్యను ఎవరైనా ఏమైనా అంటే కొట్టాలన్నంత కోపం వస్తుంది!: పవన్ కల్యాణ్

  • నన్ను ఎవరు ఎన్ని మాటలన్నా కోపం రాదు  
  • ఆయన రాజకీయాలకు దూరంగా వెళ్లారు
  • తెలంగాణలో కూడా జనసేన ఉంటుంది

తనను ఎవరు ఎన్ని మాటలన్నా కోపం రాదని... కానీ, అన్నయ్య చిరంజీవిని ఒక్క మాట అన్నా వెళ్లి కొట్టాలన్నంత కోపం వస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అన్నయ్య ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా వెళ్లారని చెప్పారు. ఒకే కుటుంబంలో పుట్టినవాళ్ల మధ్య కూడా భిన్నమైన అభిప్రాయాలు, ఆలోచనలు, వ్యక్తిత్వాలు ఉంటాయని... వాటిని అర్థం చేసుకోకుండా మనస్పర్థలు అంటూ ప్రచారం చేయడం తప్పని అన్నారు. ఏపీలోనే కాకుండా తెలంగాణలో కూడా జనసేన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. చిరంజీవి అభిమానులు జనసేనలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రస్తంగిస్తూ, ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

మరోవైపు పవన్ ప్రసంగాన్ని ప్రారంభించిన వెంటనే అభిమానులు 'సీఎం.. సీఎం' అంటూ నినాదాలు చేశారు. దీంతో, వారిని వారించేందుకు పవన్ యత్నించారు. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఉండాలని... కానీ, అత్యుత్సాహమనేది క్రమశిక్షణను దెబ్బతీస్తుందని చెప్పారు. అయినా కొందరు వినకుండా తమ నినాదాలను కొనసాగించడంతో, ఆయన కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 'ఏయ్.. ఎక్కువ చేయకు.. ఆపేయ్' అంటూ మందలించారు. 

Pawan Kalyan
Chiranjeevi
janasena
angry
  • Loading...

More Telugu News