special trains: వచ్చే నెల నుంచి వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు: దక్షిణమధ్య రైల్వే ప్రకటన
- పండగల నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు
- ఆగస్టు 3 నుంచి ప్రత్యేక రైళ్లు
- దక్షిణమధ్య రైల్వే అధికారుల ప్రకటన
వినాయకచవితి, దసరా పండగల నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమవుతోంది. వచ్చే నెల 3 నుంచి వివిధ మార్గాల్లో 117 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. ఏయే మార్గాల్లో, ఏ తేదీలలో ప్రత్యేక రైళ్లు నడుస్తాయో వాటి వివరాలు..
లింగంపల్లి-విశాఖపట్టణం స్పెషల్ (07148) : ఆగస్టు 3, 10, 17, 24, 31, సెప్టెంబరు 7, 14, 21, 28, అక్టోబరు 5, 12, 19, 26 తేదీలలో సాయంత్రం ఐదు గంటలకు బయలు దేరుతుంది. సికింద్రాబాద్ మీదుగా వెళ్లే ఈ రైలు మర్నాడు ఉదయం 8 గంటలకు విశాఖకు చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో విశాఖపట్టణం-లింగంపల్లి స్పెషల్ (07147) ఆగస్టు 4, 11, 18, 25, సెప్టెంబరు 1, 8, 15, 22, 29, అక్టోబరు 6, 13, 20, 27 తేదీల్లో ఉదయం 10.15 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 11.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
లింగంపల్లి - కాకినాడ టౌన్ స్పెషల్ (07075): ఆగస్టు 5,12,19,26, సెప్టెంబరు 2, 9, 16, 23, 30, అక్టోబరు 7, 14, 21, 28 తేదీల్లో ఉదయం 4.55 గంటలకు బయలుదేరుతుంది. సికింద్రాబాద్ మీదుగా వెళ్లే ఈ రైలు అదేరోజు సాయంత్రం 4.45 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో కాకినాడ టౌన్ -లింగంపల్లి స్పెషల్ (07076).. ఆగస్టు 5,12,19,26, సెప్టెంబరు 2, 9, 16, 23, 30, అక్టోబరు 7, 14, 21, 28 తేదీల్లో రాత్రి 7 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.45 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.
విశాఖపట్టణం- తిరుపతి స్పెషల్ (07479): ఆగస్టు 8, 15, 22, 29, సెప్టెంబరు 5, 12, 29, 26, అక్టోబరు 3, 10, 17, 24, 31వ తేదీల్లో రాత్రి 7.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
తిరుపతి- విశాఖపట్టణం ఏసీ వీక్లి స్పెషల్ (07487): తిరుపతి నుంచి ఆగస్టు 5,12,19,26, సెప్టెంబరు 2, 9, 16, 23, 30, అక్టోబరు 7, 14, 21, 28 తేదీల్లో రాత్రి 10.30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు విశాఖకు చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ (07488).. ఆగస్టు 6, 13, 20, 27, సెప్టెంబరు 3, 10, 17, 24, అక్టోబరు 1, 8, 15, 22, 29 తేదీల్లో రాత్రి 7.20 గంటలకు బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 8.10 గంటలకు చేరుతుంది.
తిరుపతి- కాచిగూడ స్పెషల్ (07146): ఆగస్టు 9, 16, 23, 30, సెప్టెంబరు 6, 13, 20, 27, అక్టోబరు 4, 11, 18, 25, నవంబరు 1న సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.0 గంటలకు కాచిగూడ చేరుతుంది.
కాచిగూడ-విశాఖపట్టణం స్పెషల్ (07016): ఆగస్టు 7, 14, 21, 28, సెప్టెంబరు 4, 11, 18, 25, అక్టోబరు 2, 9,16, 23, 30వ తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు విశాఖకు చేరుతుంది.