Japan: రైలు వేగాన్ని ఒక నిమిషం పెంచేందుకు రెండేళ్ల ప్రాజెక్టును ప్రారంభించిన జపాన్!

  • రైలు ప్రయాణ సమయాన్ని ఒక నిమిషం ముందుకు
  • రెండేళ్ల ప్రాజెక్టుకు జపాన్ రైల్వే శ్రీకారం
  • ప్రయాణికులను పెంచుకునేందుకేనన్న అధికారులు

జీవితంలో సమయానికి ప్రాధాన్యం ఇచ్చే వారు అత్యంత ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. సమయాన్ని విభజించుకోవడం అందరికీ చేతనయ్యే పనికాదు. గడచిన కాలం తిరిగి రాదన్న విషయం అందరికీ తెలుసు. కానీ అనవసర కాలక్షేపాలతో గంటల కొద్దీ సమయాన్ని వృథా చేస్తుంటారు. అయితే, ప్రపంచ యుద్ధంలో సర్వనాశనమైన జపాన్ అనతి కాలంలో అభివృద్ధి చెందిన దేశంగా ఎలా ఎదిగింది? దీనికి ఒకే ఒక్క సమాధానం... సమయం. టైముకు జపనీయులు ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. క్షణాలను కూడా వారు లెక్కగట్టుకుంటారని చెప్పడానికి మరో ఉదాహరణే ఇప్పుడా దేశం చేపడుతున్న రైల్వే ప్రాజెక్టు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

జపాన్‌లోని యెనో-ఒమియా నగరాల మధ్య ప్రయాణిస్తున్న బుల్లెట్ రైలు వేగాన్ని ఒకేఒక్క నిమిషం పెంచేందుకు జేఆర్ ఈస్ట్, ఈస్ట్ జపాన్ కంపెనీలు రెండేళ్ల ప్రాజెక్టును చేపట్టాయి. ఈ రెండు నగరాల మధ్య రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనికి సమయం 30 నిమిషాలు పడుతోంది. ఇప్పుడీ ప్రాజెక్టు ద్వారా రైలు వేగాన్ని 130 కిలోమీటర్లకు పెంచనున్నారు. ఫలితంగా నిర్ణీత సమయం కంటే నిమిషం ముందుగా అంటే 29 నిమిషాలకే రైలు గమ్యానికి చేరుకుంటుంది. ప్రయాణ సమయాన్ని ఒక నిమిషం తగ్గించడం ద్వారా మరింతమంది ప్రయాణికులను ఆకర్షించవచ్చని, ఇదో గొప్ప ప్రాజెక్టని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

రైలు ప్రయాణించేటప్పుడు వచ్చే శబ్దం వల్ల ట్రాక్ చుట్టుపక్కల ఉండే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కొత్త ప్రాజెక్టుల ఆ ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రకంపనలు, చెవులు చిల్లులు పడే శబ్దాలు రాకుండా రైలు పట్టాలే వాటిని గ్రహించేలా సాంకేతికత వాడనున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News