Thailand: థాయ్‌లాండ్ గుహ నుంచి మరో నలుగురు చిన్నారులు బయటకి.. నేడు మూడో దశ ఆపరేషన్

  • గుహలో మొత్తం చిక్కుకుపోయింది 13 మంది
  • ఇప్పటి వరకు 8 మంది వెలికితీత
  • కొనసాగుతున్న సహాయక చర్యలు

సందర్శనకు వెళ్లి గుహలో చిక్కుకుపోయిన థాయ్ చిన్నారుల్లో మరో నలుగురిని సోమవారం సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో బాహ్యప్రపంచంలోకి వచ్చిన చిన్నారుల సంఖ్య 8కి చేరింది. గుహలో ఇంకా కోచ్ సహా మరో నలుగురు బాలురు ఉన్నారు. నేడు మూడో విడత ఆపరేషన్ చేపట్టి వారిని బయటకు తీసుకువచ్చే అవకాశం ఉంది.

బయటకు తీసుకువచ్చిన చిన్నారులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బయటపడిన నలుగురు విద్యార్థుల వివరాలు బయట పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. వారిని అంబులెన్స్ లోకి ఎక్కిస్తున్నప్పుడు ముఖాలు మీడియాకు కనిపించకుండా తెల్లటి గొడుగులను అడ్డం పెట్టారు. థాయ్‌లాండ్‌ ప్రధాని ప్రయుత్‌ చాన్‌ఓచా సంఘటన స్థలాన్ని సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. కాగా, వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో సోమవారం అనుకున్న సమయానికి ఐదు గంటల ముందే పిల్లలను బయటకు తీసుకు రాగలిగినట్టు ఈ ఆ‌పరేషన్‌ను పర్యవేక్షిస్తున్న చియాంగ్‌రాయ్‌ గవర్నరు నరోంగ్‌సక్‌ ఒసొట్టానకోర్న్‌ తెలిపారు.

  • Loading...

More Telugu News