srikanth: శ్రీకాంత్ హీరోగా 'కోతలరాయుడు' మొదలు!

  • సుధీర్ రాజు దర్శకత్వంలో శ్రీకాంత్ 
  • కథానాయికలుగా నటాషా దోషి .. డింపుల్ చోపడే 
  • ఈ నెల 16 నుంచి రెగ్యులర్ షూటింగ్

ఒక వైపున కీలకమైన పాత్రలను చేస్తూనే .. మరో వైపున హీరోగాను తనకి వచ్చిన అవకాశాలను శ్రీకాంత్ ఉపయోగించుకుంటున్నాడు. ఈ క్రమంలో హీరోగా ఆయన మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. సుధీర్ రాజు దర్శకత్వంలో కొలన్ వెంకటేశ్ నిర్మిస్తోన్న ఈ సినిమా కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాకి 'కోతలరాయుడు' టైటిల్ ను ఖరారు చేయగా, శ్రీకాంత్ సరసన డింపుల్ చోపడే .. నటాషా దోషి నటించనున్నారు.

ఈ నెల 16వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఆగస్టు చివరివారం నాటికి షూటింగు పార్టును పూర్తి చేసుకోనుంది. బెంగుళూరు .. రాజమహేంద్రవరంలలో ఎక్కువభాగం చిత్రీకరణను జరపనున్నారు. టైటిల్ చూస్తుంటే .. మాస్ ఆడియన్స్ కి సంబంధించిన కంటెంట్ ఉండవచ్చనిపిస్తోంది. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన పాత్రలనే కాదు, కామెడీ టచ్ తో సరదాగా సాగిపోయే పాత్రల్లోను శ్రీకాంత్ చాలా బాగా మెప్పిస్తాడు. అందువలన 'కోతలరాయుడు' శ్రీకాంత్ కి హిట్ తెచ్చిపెట్టే అవకాశాలైతే ఉన్నాయని చెప్పొచ్చు.        

srikanth
natasha
  • Loading...

More Telugu News