chaitu: సమంత ఇకపై సినిమాలు చేయదనే వార్తపై స్పందించిన చైతూ

- సమంతకి సినిమాలంటే ఇష్టం
- ఆమె ఈ రంగానికి దూరం కాదు
- అవసరాన్ని బట్టి బ్రేక్ తీసుకోవచ్చు
తెలుగు తెరపై విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తూ విజయాలను అందుకుంటూ సమంత ముందుకు సాగుతోంది. తమిళంలోను ఆమె ఇదే జోరును కొనసాగిస్తోంది. అగ్ర కథానాయకుల సినిమాల్లో వరుసగా అవకాశాలు వస్తోన్న నేపథ్యంలో, సమంత ఇకపై సినిమాలు చేయదనీ .. ఇంటిపట్టునే వుండాలని నిర్ణయించుకుందనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి.
