Kathi Mahesh: కత్తి మహేష్ ను రాష్ట్రం నుంచి కూడా బహిష్కరించే అవకాశం ఉంది: డీజీపీ మహేందర్ రెడ్డి

  • ఏపీలో ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా చర్యలు తప్పవు
  • సోషల్ మీడియాలో కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయరాదు
  • అవసరాన్ని బట్టి రాష్ట్ర బహిష్కరణ కూడా విధించే అవకాశం

సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై నగరబహిష్కణ వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, బహిష్కరణ సమయంలో హైదరాబాదులోకి ప్రవేశించేందుకు యత్నిస్తే మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అన్నారు. రానున్న రోజుల్లో జరగబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని... రాష్ట్రం నుంచి కూడా అతనిని బహిష్కరించే అవకాశం ఉందని చెప్పారు. ఏపీలో ఉంటూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, అభ్యంతరకరంగా మాట్లాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

Kathi Mahesh
dgp
mahender reddy
  • Loading...

More Telugu News