kathi mahesh: కత్తి మహేష్ ను హైదరాబాద్ నుంచి బహిష్కరించిన పోలీసులు

  • శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్
  • తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్న వ్యాఖ్యలు 
  • అరెస్ట్ చేసి, ఏపీ పోలీసులకు అప్పగించిన టీఎస్ పోలీసులు

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలను గాయపరిచిన సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేశారు. తమ అనుమతి లేకుండా నగరంలో అడుగుపెట్టవద్దని ఆదేశించారు. దీనికి తోడు, కత్తి మహేష్ ను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు... ఆయనను ఏపీ పోలీసులకు అప్పగించినట్టు తెలుస్తోంది. కత్తి మహేష్ హైదరాబాద్ లో ఉంటే ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందనే కారణాలతో ఆయనపై బహిష్కరణ వేటు వేశారు.

శ్రీరాముడిని విమర్శించిన కత్తి మహేష్ పై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు పెట్టారు. మరోవైపు, కత్తి వ్యాఖ్యలను నిరసిస్తూ... పరిపూర్ణానందస్వామి హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రకు సిద్ధమయ్యారు. అయితే, యాత్రకు అనుమతిని నిరాకరించిన పోలీసులు... ఆయనను గృహనిర్బంధం చేశారు. 

kathi mahesh
hyderabad
police
  • Loading...

More Telugu News