Pawan Kalyan: జనసేనలో చేరనున్న చిరంజీవి అభిమానులు... నేడు గచ్చిబౌలిలో సభ!

  • మధ్యాహ్నం 3.30 గంటలకు ముహూర్తం
  • ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న చిరంజీవి ఫ్యాన్స్
  • ముఖ్య నేతలతో విడిగా సమావేశం కానున్న పవన్

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల చిరంజీవి అభిమానులు నేడు జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు గచ్చీబౌలీలో జరిగే ఓ కార్యక్రమంలో చిరంజీవి సంఘాలు పవన్ కల్యాణ్ తో సమావేశమై, జనసేన కండువాను కప్పుకోనున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి వచ్చిన మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ తో గచ్చిబౌలీ వద్ద సందడి నెలకొని వుంది. జనసేనలో చేరడానికి వచ్చిన వారిని పార్టీలోకి ఆహ్వానించిన తరువాత, వారిని ఉద్దేశించి పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆపై చిరంజీవి అభిమాన సంఘాల నేతలతో పవన్ విడిగా సమావేశమవుతారని సమాచారం.

Pawan Kalyan
Chiranjeevi
Jana Sena
Fans
  • Loading...

More Telugu News