Congress: ఆ పని చేయలేని మీరు ఎమ్మెల్యేలా?.. ప్రజలకు వైసీపీ క్షమాపణలు చెప్పాల్సిందే: రఘువీరా

  • వైసీపీ ఎమ్మెల్యేలు ఉండీ దండగే
  • ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా వారు విఫలం
  • వైఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే

అసెంబ్లీకి వెళ్లని, ప్రజా సమస్యలు చర్చించని వారు ఎమ్మెల్యేలుగా ఉండడం దండగని కాంగ్రెస్ ఏపీ ఛీప్ రఘువీరా రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలపై ఫైరయ్యారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఉండడానికి వారు అనర్హులన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై పట్టించుకోని, ప్రజల అజెండాను సభలో చర్చించని వైసీపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమన్న రఘువీరా రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో జవాబుదారీ తనం లోపించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ది ఒంటరి పోరేనని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని పేదలకు దుస్తులు పంపిణీ చేసిన ఆయన వైఎస్, కాంగ్రెస్ వేర్వేరు కాదన్నారు.

Congress
YSRCP
Raghuveera Reddy
YSR
Telugudesam
  • Loading...

More Telugu News