Tollywood: అవసరమైనప్పుడు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తా: యూఎస్ సెక్స్ రాకెట్‌పై రెజీనా

  • నాకు సంబంధం లేకుండా నా పేరు ఇరికించారు
  • కార్నర్ కాకూడదనే ఇన్నాళ్లూ మాట్లాడలేదు
  • రూమర్లు విని బాధేసింది

అమెరికా సెక్స్ రాకెట్ వ్యవహారంలో తన పేరు ఉన్నట్టు వస్తున్న వార్తలపై నటి రెజీనా స్పందించింది. ఈ విషయంలో తన ప్రమేయం లేకుండానే రూమర్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతీ విషయానికి స్పందించి అనవసరంగా కార్నర్ కాకూడదనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించలేదని పేర్కొంది. ఏదైనా విషయం గురించి అవతలి వారు మాట్లాడేముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించింది. తనకు ఏమాత్రం సంబంధం లేని విషయంలో ఇరికించడం బాధగా ఉందని పేర్కొంది. అవసరం అనిపిస్తే అప్పుడు అన్ని ప్రశ్నలకు తీరిగ్గా సమాధానం ఇస్తానని రెజీనా వివరించింది.

ఇటీవల బయటపడిన అమెరికా సెక్స్ రాకెట్ వ్యవహారం టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపింది. పదుల సంఖ్యలో మహిళా నటుల పేర్లు బయటపడడం సంచలనమైంది. సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో టాలీవుడ్ నుంచి ఆర్టిస్టులను రప్పించి వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తేల్చిన అమెరికా ఫెడరల్ పోలీసులు సూత్రధారి కిషన్ మోదుగుమూడి (34), అతడి భార్య చంద్రకళ పూర్ణిమ మోదుగుమూడిలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.  

Tollywood
America
S*x Racket
Actress
Rejina
  • Loading...

More Telugu News