jail: జైలుకెళ్లి నిందితులని కలిసి.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి!

  • అల్లర్లలో పాల్గొని బీహార్‌లోని నవాడా జైల్లో నిందితులు
  • హిందూ సంఘాల కార్యకర్తలను కలిసిన కేంద్రమంత్రి
  • శాంతియుత వాతావరణం కోసం కృషి చేశారన్న గిరిరాజ్‌ సింగ్‌
  • ఈ అరెస్టులు దురదృష్టకరమని వ్యాఖ్య

అల్లర్లలో పాల్గొని బీహార్‌లోని నవాడా జైల్లో ఉంటోన్న బజరంగ్‌ దళ్‌, విశ్వ హిందూ పరిషత్‌ కార్యకర్తలను కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ కలవడం విమర్శలకు తావిస్తోంది. దాదాపు 30 నిమిషాల పాటు వారితో మాట్లాడి, జైల్లో వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు.

కార్యకర్తలు జిట్టు, కైలాష్‌లను అరెస్ట్ చేయడం దురదృష్టకరమని, నిజానికి 2017లో శ్రీరామ నవమి సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తుతున్నప్పుడు, అలాగే, అక్బర్‌పూర్‌లో దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పుడు వీరిద్దరు ఆయా ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం కోసం కృషి చేశారని సదరు కేంద్రమంత్రి అన్నారు.

ఇటువంటి కార్యకర్తలను అల్లరి మూకలు అని ఎలా అపనింద వేస్తారని ప్రశ్నించారు. హిందువులను అణచివేస్తే మత సామరస్యాన్ని రక్షించవచ్చని రాష్ట్ర సర్కారు అనుకుంటే అది పొరపాటని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News