Telangana: తెలంగాణకు అతి భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు

  • మంత్రులంతా జిల్లాల్లోనే ఉండాలి
  • అధికారులంతా స్థానికంగానే ఉండి చర్యలు తీసుకోవాలి
  • అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. దీంతో రాష్ట్ర మంత్రులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మంత్రులంతా జిల్లాల్లోనే ఉండి, పరిస్థితులను సమీక్షించాలని, వర్షాల కారణంగా ఎవరైనా నష్టపోతే వారికి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.

అలాగే, అధికారులంతా స్థానికంగానే ఉండి చర్యలు చేపట్టాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి తెలిపారు. కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రులు రేపు జిల్లాల్లోనే ఉండాల్సి ఉన్నందున రేపు జరగాల్సిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. 

  • Loading...

More Telugu News