Telugudesam: జమిలి ఎన్నికలపై అభిప్రాయం తెలిపిన టీడీపీ!

  • రాష్ట్రాల హక్కులను హరించేలా ఉంటే మేము వ్యతిరేకిస్తాం 
  • ఏపీలో టీడీపీ సర్కారు ఐదేళ్లూ పాలన పూర్తి చేస్తుంది
  • ప్రభుత్వాలు కూలిపోతే మిగిలిన కాలానికే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది
  • అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం

రాష్ట్ర ప్రభుత్వాలపై పెత్తనం చలాయించేందుకే జమిలి ఎన్నికలను తీసుకొస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు అన్నారు. ఈరోజు లా కమిషన్‌కు తమ అభిప్రాయాన్ని చెప్పడానికి ఢిల్లీకి వెళ్లిన టీడీపీ ఎంపీలు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాల హక్కులను హరించేలా ఉంటే జమిలి ఎన్నికలకు టీడీపీ వ్యతిరేకమని అన్నారు.

2019లో వచ్చే సాధారణ ఎన్నికల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే తమకు అభ్యంతరం లేదని టీడీపీ ఎంపీలు అన్నారు. జమిలి ఎన్నికలు అమలు చేస్తే.. ఒకవేళ ఏ కారణంతో అయినా రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతే మిగిలిన కాలానికే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని, అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఏపీలో టీడీపీ సర్కారు ఐదేళ్లూ పాలన పూర్తి చేస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News