TRS: జమిలి ఎన్నికలపై లా కమిషన్‌కు తమ నిర్ణయం తెలిపిన టీఆర్‌ఎస్‌

  • అభిప్రాయాలు తెలపాలని ఇటీవల లా కమిషన్‌ ప్రకటన
  • లేఖ రాసిన కేసీఆర్‌ 
  • జమిలి ఎన్నికలకు సంపూర్ణ మద్దతు
  • జమిలి అంటే ముందస్తు ఎన్నికలు కాదన్న ఎంపీ వినోద్‌

ఏకకాలంలో లోక్‌సభ, శాసనసభల ఎన్నికలు నిర్వహిస్తే సమయంతో పాటు ప్రజాధనాన్ని ఆదా చేయవచ్చనే ఉద్దేశంతో జమిలి ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర సర్కారు భావిస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై దేశంలోని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాన్ని తెలపాలని లా కమిషన్‌ ఇటీవల ప్రకటన కూడా చేసింది. నిన్న, నేడు పలు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాన్ని లా కమిషన్‌కు తెలిపాయి. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ పార్టీ జమిలి ఎన్నికలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ లా కమిషన్‌కు లేఖ రాశారు.

తాజాగా టీఆర్ఎస్‌ ఎంపీ వినోద్‌ మీడియాతో మాట్లాడుతూ... జమిలి అంటే అందరూ ముందస్తు ఎన్నికలని అనుకుంటున్నారని, కానీ, అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంతోనే ఈ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారని అన్నారు. జమిలి ఎన్నికలపై 1986 నుంచి జాతీయ న్యాయ కమిషన్‌ చర్చిస్తోందని, ఇది మోదీ తెచ్చిన కొత్త విధానం కాదని అన్నారు. 

  • Loading...

More Telugu News