YSRCP: నాన్నా... హ్యాపీ బర్త్ డే: వైఎస్ జగన్

  • నేడు వైఎస్ఆర్ 69వ జయంతి
  • నేడు 2,500 కి.మీ. దాటనున్న జగన్ పాదయాత్ర
  • ట్విట్టర్ లో జగన్ నివాళులు

నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 69వ జయంతి కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, ఆయన్ను స్మరించుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, తన తండ్రి పుట్టిన రోజు నాడే, తన ప్రజాసంకల్ప యాత్ర 2500 కిలోమీటర్ల మైలురాయిని అందుకోనుందని గుర్తు చేశారు. ఇది యాదృచ్ఛికమే కాదని, రాష్ట్ర ప్రజలతో పాటు వైఎస్సార్‌ ఆశీస్సులు కూడా తనపై ఉన్నాయని చెబుతోందని అన్నారు.

స్వర్గం నుంచి నాన్న వైఎస్సార్‌ ఆశీర్వదించినట్టు అనిపిస్తోందని చెబుతూ... "హ్యాపీ బర్త్‌డే నాన్న" అని వ్యాఖ్యానించారు. ఎల్లప్పుడూ తమకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలని చెప్పారు. కాగా, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జగన్‌ చేపట్టిన పాదయాత్ర నేడు 208వ రోజు కొనసాగనుండగా, నేడు 2,500 కి.మీ. మైలురాయిని దాటనుంది. ఈ సందర్భంగా ఆయన ఓ మొక్కను నాటనున్నారు.

YSRCP
YSR
Jagan
Birthday
  • Loading...

More Telugu News