America: అమెరికాలో దుండగుల కాల్పులు.. వరంగల్ విద్యార్థి మృతి!

  • ‌రెస్టారెంట్‌లో శరత్‌పై కాల్పులు
  • భుజంలోకి దిగిన తూటా
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి దుండగుల కాల్పులకు బలయ్యాడు. ఆరు నెలల క్రితం మిస్సోరి యూనివర్సిటీలో ఎంఎస్ చేసేందుకు వెళ్లిన వరంగల్‌కు చెందిన కొప్పు శరత్ శుక్రవారం జరిగిన కాల్పుల్లో మృతి చెందాడు. స్నేహితులతో కలిసి కాన్సస్ సిటీలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన శరత్‌ను దుండగులు బెదిరించారు. దీంతో అతడు తప్పించుకునే ప్రయత్నంలో పరిగెత్తగా దుండగులు కాల్పులు జరిపారు. ఓ బుల్లెట్ శరత్ భుజంలోకి దూసుకెళ్లింది.

రక్తపు మ‌డుగులో కుప్పకూలిన శరత్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అతడు అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. శరత్ మృతితో ఆయన కుటుంబంలో విషాదం అలముకుంది. శరత్ తండ్రి రామ్మోహన్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి. వరంగల్ నుంచి వచ్చి హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో స్థిరపడ్డారు.

America
Warangal
Student
Died
  • Loading...

More Telugu News