music director: ‘డీఎస్పీ అనే నేను..యూఎస్ఏ వస్తున్నాను’ అంటున్న దేవిశ్రీ ప్రసాద్

  • యూఎస్ లో వరుస ప్రదర్శనలివ్వనున్న డీఎస్పీ
  • ఆగస్టు 11 నుంచి సెప్టెంబరు 16వ తేదీ వరకు ప్రదర్శనలు
  • ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసిన డీఎస్పీ

లైవ్ షోలతో స్టేజ్ పై అదరగొట్టే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) యూఎస్ఏలో వరున ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ ఓ ఆసక్తికర వీడియోను డీఎస్పీ పోస్ట్ చేశారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఎంట్రీతో ఈ వీడియో ప్రారంభమైంది.

‘అమెరికా దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి. మీ అందరి చెవుల్లో సంగీతాన్ని నింపడానికి మా డీఎస్పీ వచ్చేస్తున్నాడు.. మరే, ఫ్లైటెక్కొచ్చేస్తున్నాడు. ఆడి పాడి అలరించేస్తాడంతే.. మీరందరూ రెడీగా ఉండండి. అమ్మా, డీఎస్పీ.. వచ్చేయమ్మ నువ్వు’ అంటూ లుంగీ చొక్కా, కళ్లద్దాలు ధరించిన సుకుమార్ చెప్పడం ఆసక్తిదాయకంగా ఉంది.

ఇక ఈ వీడియోలో డీఎస్పీ పాడిన థీమ్ సాంగ్ ఆకట్టుకుంది. ‘భరత్ అనే నేను’ పాట స్టైల్ లో ఈ థీమ్ సాంగ్ సాగింది. ‘డీఎస్పీ అనే నేను..యూఎస్ఏ వస్తున్నాను. హామీ ఇస్తున్నాను.. ఆడిస్తాను పాడిస్తాను.. ఎంటర్ టెయిన్ చేస్తాను..ప్రామిస్..’ అంటూ దేవిశ్రీ ప్రసాద్ కనిపిస్తాడు. యూఎస్ లో డీఎస్పీ టూర్ ఆగస్టు 11 నుంచి సెప్టెంబరు 16వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా డీఎస్పీ తెలియజేశారు.


music director
devi sri prasad
  • Error fetching data: Network response was not ok

More Telugu News