Jagan: రాష్ట్రానికి నిజమైన ద్రోహులు జగన్-పవన్: జూపూడి ప్రభాకర్

  • బీజేపీ ప్యాకేజ్ లో పవన్ భాగంగా చేరిపోయారు
  • కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడుతున్నారు
  • ‘జనసేన పార్టీ.. ప్రజారాజ్యం పార్టీ -2లా తయారైంది

రాష్ట్రానికి నిజమైన ద్రోహులు జగన్, పవన్ కల్యాణ్ లని ఏపీ టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ ప్యాకేజ్ లో పవన్ భాగంగా చేరిపోయారని, మొన్నటి వరకు చంద్రబాబు పాలన బాగుందన్న పవన్, ఇప్పుడు ఆయన్ని రాజీనామా చేయాలనడం హాస్యాస్పదమని అన్నారు.

'విశాఖలో రైల్వే జోన్ కోసం టీడీపీ ఎంపీలు దీక్షలు చేసినప్పుడు పవన్ ఎందుకు మద్దతు ఇవ్వలేదు? వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను మోదీ వెనక్కి తీసుకుంటే పవన్ ఎందుకు ప్రశ్నించలేదు? సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేస్తే పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదు? ప్రధానిమోదీ రాజీనామా చేయాలని పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు?' అని ప్రశ్నించారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా ఆయన మాట్లాడుతున్నారని, మండిపడ్డారు. ‘జనసేన పార్టీ.. ప్రజారాజ్యం పార్టీ -2లా తయారైంది’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Jagan
Pawan Kalyan
jupudi prabhakar
  • Loading...

More Telugu News