modi: బీజేపీ నేత రాంమాధవ్ ట్వీట్ కు లోకేశ్ స్పందన

  • ‘ముందస్తు’కు ప్రాంతీయ పార్టీలు ఒప్పుకోకపోవడమే మోదీ జనాదరణకు నిదర్శనం
  • కర్ణాటకలో బీజేపీని ప్రజలు ఎందుకు తిరస్కరించారు?
  • దేశ వ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి చావుదెబ్బ తగిలింది

ప్రాంతీయ పార్టీలను బలహీనపరచాలనే ఉద్దేశంతోనే జమిలి ఎన్నికల అంశాన్ని కేంద్రం తెరపైకి తెస్తోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత రాంమాధవ్ స్పందిస్తూ, ప్రధాని మోదీకి ఉన్న ప్రజాదరణ చూసి భయపడుతున్నారని విమర్శించారు.

తాజాగా, రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ ఘాటుగా బదులిచ్చారు. ‘ముందస్తు ఎన్నికలకు ప్రాంతీయ పార్టీలు ఒప్పుకోకపోవడమే మోదీ జనాదరణకు నిదర్శనం. అలా అనుకుంటే కర్ణాటక రాష్ట్రంలో బీజేపీని ప్రజలు ఎందుకు తిరస్కరించారు? ఆ తర్వాత దేశ వ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో చావుదెబ్బ తగిలింది. అందుకే, ఇప్పుడు ముందస్తు ఎన్నికలంటూ తొందరపడుతున్నారు’ అని లోకేశ్ విమర్శించారు.

  • Loading...

More Telugu News