Telugudesam: జగన్-పవన్ లు కేంద్రానికి తొత్తులుగా మారారు: బుద్ధా వెంకన్న

  • చంద్రబాబుని రాజీనామా చేయమనే హక్కు పవన్ కు లేదు
  • పవన్ కు దమ్ముంటే ‘హోదా’ విషయమై మోదీని నిలదీయాలి
  • కేంద్రం దయతో ఏపీ ప్రభుత్వం నడవడం లేదు

వైసీపీ అధినేత జగన్, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ లపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్-పవన్ లు కేంద్రానికి తొత్తులుగా మారారని అన్నారు. పవన్ కు దమ్ముంటే ప్రత్యేక హోదా విషయమై ప్రధాని మోదీని నిలదీయాలని డిమాండ్ చేశారు.

సీఎం చంద్రబాబునాయుడిని రాజీనామా చేయమనే హక్కు పవన్ కల్యాణ్ కు లేదని అన్నారు. హోదా విషయమై ఢిల్లీ వెళ్లి చంద్రబాబు పోరాటం చేయాల్సిన అవసరం లేదని, ఇక్కడ పోరాటం చేస్తేనే అక్కడి పీఠం కదులుతోందని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబును కేంద్రం లక్ష్యంగా చేసుకుందని, కేంద్రం దయతో ఏపీ ప్రభుత్వం నడవడం లేదని అన్నారు.

Telugudesam
buddha venkanna
  • Loading...

More Telugu News