Pawan Kalyan: గంటా శ్రీనివాస్ ను టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్!

  • జూట్ మిల్లు సమస్య తెలియకనే గంటాకు మద్దతు ఇచ్చా
  • మురళీమోహన్, అవంతిలాంటి వాళ్లకు ప్రచారం చేసి తప్పు చేశా
  • టీడీపీ గూండాలను జనసైనికులు అడ్డుకోవాలి

చిట్టివలస జూట్ మిల్ లాకౌట్ సమస్య తనకు తెలియదని... అందుకే గత ఎన్నికల సమయంలో మంత్రి గంటా శ్రీనివాసరావుకు మద్దతు తెలిపానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జూట్ మిల్లు కార్మిక సంఘాలు, కార్మిక కుటుంబాలతో సమావేశమయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మిల్లు లాకౌట్ తో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది ప్రజలు రోడ్డున పడ్డారని అన్నారు. మిల్లు సమస్యలు అర్థం చేసుకోవడానికి కార్మిక సంఘాలతో విశాఖలోని పార్టీ కార్యాలయంలో మరోసారి సమావేశమవుతానని... లాకౌట్ పరిష్కారానికి దిశానిర్దేశం చేస్తానని చెప్పారు.

విశాఖ జిల్లాలో భూకుంభకోణాలకు గంటా, అతని అనుచరులే బాధ్యత వహించాలని పవన్ అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ గూండాలు అడ్డదారులు తొక్కుతారని... జనసైనికులు దీన్ని సమర్థవంతంగా అడ్డుకోవాలని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ పై టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదని... జోనూ లేదు గీనూ లేదు అని అవంతి శ్రీనివాస్ అంటే... ఐదు కిలోల బరువు తగ్గడానికి ఒక్క రోజు దీక్ష చేస్తానని మురళీ మోహన్ అన్నారని... ఇలాంటివారికి ప్రచారం చేసి గెలిపించినందుకు బాధపడుతున్నానని చెప్పారు. 

Pawan Kalyan
Ganta Srinivasa Rao
avanthi srinivas
murali mohan
  • Loading...

More Telugu News