kiran kumar reddy: రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న కిరణ్ కుమార్ రెడ్డి.. మీరూ చేరాలంటూ పలువురికి ఫోన్లు!

  • 13న కాంగ్రెస్ లో చేరనున్న కిరణ్ కుమార్ రెడ్డి
  • వైసీపీపై ఎదురుదాడి చేయగలిగే నేత అవసరమని భావిస్తున్న అధిష్ఠానం
  • అందుకే కిరణ్ ను తీసుకోవాలని భావించిన రాహుల్  

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 13న పార్టీ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు. దీనికి సంబంధించి పార్టీ శ్రేణులు స్పష్టతనిచ్చాయి. 13న రాహుల్ తో పాటు, అధిష్ఠానం పెద్దలతో కిరణ్ సమావేశమవుతారని తెలిపాయి.

 మరోవైపు, ఇతర పార్టీల్లో చేరని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర నేతలకు కూడా కిరణ్ ఫోన్లు చేస్తున్నారని... తిరిగి కాంగ్రెస్ లో చేరాలని సూచిస్తున్నారని సమాచారం. ఏపీలో కాంగ్రెస్ బలోపేతం కావాలంటే... ప్రధాన ప్రతిపక్షం వైసీపీపై సమర్థవంతంగా ఎదురుదాడి చేయగల నాయకుడు అవసరమని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కిరణ్ ను మళ్లీ పార్టీలోకి తీసుకోవాలని రాహుల్ నిర్ణయించారు.  

kiran kumar reddy
Rahul Gandhi
congress
  • Loading...

More Telugu News