Narendra Modi: ప్రధాని మోదీకి అసాధారణ భద్రత.. నిఘా సంస్థల హెచ్చరికలే కారణం

  • నేడు జైపూర్‌లో మోదీ పర్యటన
  • నిఘా సంస్థల హెచ్చరికలు
  • 8 వేల మంది పోలీసులతో భారీ భద్రత

ప్రధాని నరేంద్రమోదీకి ముప్పు పొంచి ఉందన్న నిఘా సంస్థల హెచ్చరికలతో అసాధారణ భద్రత కల్పించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో నేడు ప్రధాని పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన  భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో  ఆయన భద్రతకు ప్రమాదం పొంచి ఉందని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయి.

దీంతో రాజస్థాన్ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. ఏకంగా 8 వేల మంది పోలీసులతో అసాధారణ భద్రత కల్పించినట్టు రాజస్థాన్ అదనపు డీజీపీ ఎన్ఆర్‌కే రెడ్డి తెలిపారు. 19 మంది ఎస్పీలు, 55 మంది అదనపు ఎస్పీలు, 95 మంది డీఎస్పీలు, 300 మంది ఇన్‌స్పెక్టర్లతోపాటు 13 కంపెనీల రాజస్థాన్ సాయుధ పోలీసులను మోహరించినట్టు డీజీపీ తెలిపారు.

Narendra Modi
Rajasthan
Jaipur
  • Loading...

More Telugu News