bjp: అమర్ నాథ్ యాత్ర ముగిసిన తర్వాత జమ్ముకశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు?
- పీడీపీ రెబెల్స్, స్వతంత్రులతో కలసి ప్రభుత్వ ఏర్పాటు
- గవర్నర్ ను కూడా మార్చే అవకాశం
- పీఠాన్ని అధిష్టించే దిశగా బీజేపీ అడుగులు
జమ్ముకశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోందని విశ్వసనీయంగా తెలుస్తోంది. పీడీపీతో బీజేపీ తెగదెంపులు చేసుకోవడంతో... ప్రస్తుతం అక్కడ గవర్నర్ పాలన నడుస్తోంది. తాజాగా, పీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది.
అమర్ నాథ్ యాత్ర ముగిసిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచించుకుంటోంది. తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో గవర్నర్ వోహ్రాను కూడా మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. 87 అసెంబ్లీ స్థానాలున్న జమ్ముకశ్మీర్ లో బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉండగా... పీడీపీకి 28 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.