karthi: రైతు సమస్యలపై పోరాటం .. రైతు పాత్రలో కార్తీ

- తమిళంలో 'కడైకుట్టి సింగం'
- తెలుగు టైటిల్ గా 'చినబాబు'
- కార్తీ జోడీగా సాయేషా సైగల్
తమిళంలో వరుస సినిమాలు చేస్తూ .. తెలుగులోను అవి విడుదలయ్యేలా చూస్తూ కార్తీ ముందుకు వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా తమిళంలో 'కడైకుట్టి సింగం' సినిమా రూపొందింది. తెలుగులో ఈ సినిమాకి 'చినబాబు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సూర్య సొంత బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహించాడు.
