kiran kumar reddy: కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి.. ముహూర్తం ఖరారు?

  • ఈ నెల 13న కాంగ్రెస్‌లోకి ఏపీ మాజీ సీఎం
  • ఈరోజు లేక రేపు ఢిల్లీకి పయనం
  • సోనియా, రాహుల్‌తో భేటీ

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారయినట్లు తెలుస్తోంది. ఈ నెల 13న ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు సాయంత్రం లేక రేపు ఉదయం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్‌లో చేరే ముందు యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ఆయన భేటీ అవుతారు. ఏపీలో పార్టీని బలోపేతం చేసే విషయాలు, పార్టీలో తాను పోషించాల్సిన పాత్రపై ఆయన చర్చలు జరుపుతారు.  

kiran kumar reddy
Congress
Sonia Gandhi
Rahul Gandhi
  • Loading...

More Telugu News