wife: నడిరోడ్డుపై భార్యను వేట కొడవలితో నరికిన భర్త!

  • తమిళనాడు, దిండిగల్ జిల్లాలో దారుణం
  • బస్టాండ్ లో భార్యను వేటకొడవలితో నరికిన భర్త
  • ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. జీవితాంతం భార్యకు తోడుండాల్సిన భర్త... ఆమెను అత్యంత పాశవికంగా అంతమొందించాడు. ఈ ఘటన దిండిగల్ జిల్లా రాజపాలెంలో చోటు చేసుకుంది. మదీశ్వరన్ అనే వ్యక్తి తన భార్య ప్రియను తన వెంట తెచ్చుకున్న వేటకొడవలితో నడిరోడ్డుపై కసితీరా నరికాడు. వెంటనే కొందరు అక్కడకు పరుగెత్తుకుంటూ వచ్చారు. దీంతో, మదీశ్వరన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే అక్కడున్నవారు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలికి చేరుకున్న స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కాసేపటికే ఆమె మరణించింది. గత నెల 20న జరిగిన ఈ దారుణం, ఆలస్యంగా వెలుగు చూసింది. మదీశ్వరన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని తెలుస్తోంది. రాజపాలెం బస్టాండ్ లో జరిగిన ఈ దారుణం సీసీటీవీలో రికార్డయింది. 

wife
murder
husbang
tamilnadu
  • Loading...

More Telugu News