Andhra Pradesh: నిరుద్యోగులకు నిరాశ... తక్షణం డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేమన్న ఏపీ మంత్రి గంటా

  • కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు
  • ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాలేదన్న గంటా
  • టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది మంది నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుండగా, ఇప్పట్లో నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి లేదని మంత్రి గంటా శ్రీనివాస్ తేల్చి చెప్పారు. ఈ ఉదయం అమరావతిలో పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన ఆయన, ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రానందున డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేక పోతున్నామని చెప్పారు. ఎన్సీటీఈ ఆదేశాలపై మరింత స్పష్టత రావాల్సివుందని వెల్లడించిన గంటా, సాధ్యమైనంత త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. 

Andhra Pradesh
Tenth
Suplimentary
Results
DSC
Ganta Srinivasa Rao
  • Loading...

More Telugu News